Monday, January 20, 2025
HomeTrending Newsఆలోచించి మాట్లాడాలి: విపక్షాలపై సోము ఫైర్

ఆలోచించి మాట్లాడాలి: విపక్షాలపై సోము ఫైర్

I am pro-poor: తమ పార్టీ గురించి మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించి ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విపక్ష నేతలకు సూచించారు. ఆర్టీసీ మంత్రి గన్ మెన్ కూడా లేకుండా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాల్సి ఉంటుందని పేర్ని నానిని ఉద్దేశించి వీర్రాజు వ్యాఖ్యానించారు. కనీసం పది శాతం ఓట్లు సాధించుకోవాలంటూ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కూడా సోము తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఐదు శాతం, బద్వేల్ లో 15 శాతం ఓట్లు సంపాదించామని, బద్వేల్ లో వైసీపీ వాళ్ల ప్యాంట్లు తడిపేశామని ఎద్దేవా చేశారు. ఉనికి కోసం బిజెపి పోరాటం అంటూ బొత్స చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ…1998లోనే తమ పార్టీ ఏపీలో 18 శాతం ఓట్లు సంపాదించిందని, రెండు పార్లమెంట్ సీట్లు గెల్చుకున్నామని గుర్తు చేశారు. భారతీయ జగన్ పార్టీ అంటూ పయ్యావుల వ్యాఖ్యలపై సోము మండిపడ్డారు. తమ పార్టీపై మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని, తమ వల్లే 1999, 2014లో గెలిచిన విషయం గుర్తుంచుకోవాలని  హెచ్చరించారు. సిపిఐ నేత రామకృష్ణపై కూడా సోము ఫైర్ అయ్యారు… ఈ పార్టీలు అక్కడక్కడా చందాలు వసూలు చేసుకొని బతికే పార్టీలని దుయ్యబట్టారు.

బిజెపి-జనసేన మిత్రపక్షాలేనని, అందులో అనుమానాలు అక్కరేదని వీర్రాజు అన్నారు. జనసేన కేవలం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమేకాదని, మూతపడ్డ పరిశ్రమలపై కూడా పోరాటం చేయాలని సూచించారు.

రాబోయే కాలంలో ఇంకా దూకుడుగా బిజెపి వ్యవహరిస్తుందని సోము వెల్లడించారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఉందని, దాన్ని బిజెపి భర్తీ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న బిజెపి నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభ విజయమవంతం అయ్యిందని, ఈ సభకు సహకరించిన అందరికీ సోము కృతజ్ఞతలు తెలియజేస్తూ విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా తామే ఉన్నామని, ప్రజలందరికీ న్యాయం చేసేలా  తమ విధానాలు ఉంటాయని వీరాజు చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అన్యాయం చేస్తోందన్నారు. తాము ట్రేడింగ్ చేయబోమని, రూలింగ్ చేశామని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు.

తాను పేదల పక్షపాతినని, వైసీపీ ప్రభుత్వం మద్యం రెట్లు పెంచి పేదల రక్తం తాగుతోందని, పేదల కోసం ఆలోచించే మద్యం విషయంలో తాను అలా మాట్లాడవలసి వచ్చిందని వీర్రాజు వివరణ ఇచ్చారు. కేవలం ఓ వర్గాన్ని దెబ్బతీయడం కోసమే సినిమా టికెట్ల రెట్లు పెంచారన్నారు.

Also Read : రాష్ట్రంలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు: సోము

RELATED ARTICLES

Most Popular

న్యూస్