I am sorry: కడపపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భేషరతుగా రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. కడప ప్రజలకు ప్రాణాలు తీయడం తప్ప ఏమీ తెలియదు’ అంటూ అయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. రాయలసీమ ప్రజలు పెద్దఎత్తున దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య విషయాన్ని ప్రస్తావిస్తూ మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని నిన్న సోము వివరణ ఇచ్చినప్పటికీ నిరనస తీవ్రత చల్లారలేదు. దీనితో పరిస్థితిని గమనించిన వీర్రాజు నేడు ఓ ట్వీట్ చేస్తూ తన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
“రాయలసీమ రతనాల సీమ…. ఈపదం నాహృదయంలో పదిలం…. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించే విషయంలో వాడిన పదాల వల్ల రాయలసీమ ప్రజలు మనసులు గాయపడ్డాయి. ఈ పదాలను వాపసు తీసుకుంటున్నాను. ఈ విషయంలో క్షమాపణలు చెబుతున్నాను. నేను నిరంతరం రాయలసీమ అభివృద్ధి విషయంలో అనేక వేదికలపై ప్రస్తావిస్తూ వస్తున్న విషయం ఆ ప్రాంత వాసులకు తెలుసు, రాయలసీమకు నికర జలాలు, పెండింగ్ ప్రాజెక్టుల విషయాలను అనేక సందర్భాల్లో ప్రస్తావించాను. రాయలసీమ అభివృద్ధి ఇంకా వేగవంతం కావాలని భారతీయ జనతా పార్టీ ఆలోచన” అంటూ ట్వీట్ చేశారు.
Also Read : సోము వ్యాఖ్యలపై వివాదం-వివరణ