నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మలినేని గోపీచంద్ తో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. . మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రాయలసీమలో జరుగుతోంది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
అయితే.. ఈ మూవీ తర్వాత బాలయ్య సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ మూవీ స్టోరీ తండ్రీకూతుళ్ల ఎమోషన్స్ ప్రధానంగా సాగుతుందని అనిల్ రావిపూడి ఆమధ్య ఓ ఇంటర్ వ్యూలో చెప్పాడు. కూతురు పాత్రలో శ్రీలీలను తీసుకోవడం జరిగిపోయిందని అన్నాడు. మరి.. బాలయ్య సరసన నటించే హీరోయిన్ ఎవరంటే.. సోనాక్షి అని టాక్ వినిపిస్తోంది.
బాలీవుడ్ లోని అందాల భామల్లో సోనాక్షి సిన్హా ఒకరు. బలమైన సినిమా నేపథ్యాన్ని కలిగిన కుటుంబం నుంచి వచ్చిన సోనాక్షి, తన టాలెంట్ తోనే నిలబడటానికి ప్రయత్నిస్తూ వచ్చింది. తమిళంలో రజనీకాంత్ సరసన నాయికగా సోనాక్షి లింగా సినిమా చేసింది. ఆ తరువాత తెలుగు సినిమాలో కూడా నటిస్తుంది అనుకున్నారు గానీ, ఇంత వరకూ చేయలేదు. తాజాగా బాలయ్య సరసన ఆమె నటిస్తుందనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. మరి.. త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.
Also Read : సంక్రాంతికి పోటీకి సై అంటున్న చిరు, బాలయ్య..?