Saturday, January 18, 2025
Homeసినిమాఎఫ్-3లో ఇద్దరు ‘స్పెషల్’ హీరోయిన్స్

ఎఫ్-3లో ఇద్దరు ‘స్పెషల్’ హీరోయిన్స్

విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్‌-3’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఎఫ్‌-2’ కి సీక్వెల్ గా రూపొందుతోన్న ఈ సినిమా పై మొదటి నుంచి పాజిటివ్ టాక్ వినబదుతోంది. ‘ఎఫ్‌-2’ ఫ్యామిలీ చిత్రంగా ఆకట్టుకుంది, దీంతో ఎఫ్-3 పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరోనా కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ పడడంతో సినిమా విడుదల లేట్ అయ్యింది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేయడంతో తిరిగి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ సాంగ్ లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని తెలిసింది. వీరిలో బాలీవుడ్ హీరోయిన్ సోనాలి చౌహాన్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసారట. ఇప్పుడు మిగిలిన హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసిన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఎవరంటే.. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ‘ఎఫ్-2’ సీక్వెల్ అంటే..అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అయితే.. Speciఅంచనాల సంగతి పక్కన పెడితే… ఖచ్చితంగా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా, వినోదాత్మకంగా ‘ఎఫ్‌-3’ ఉంటుందని చెబుతున్నారు. మరి.. అంచనాలను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్