After a long time: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకోవడంతో తదుపరి చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది కానీ.. ఇంకా ఈ మూవీ సెట్స్ పైకి మాత్రం వెళ్లలేదు. దీంతో ఈ సినిమా అప్ డేట్స్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రను బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రేతో చేయించాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. తెలుగులో సోనాలి బింద్రే మురారి, మన్మధుడు, శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. ఆతర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఆమధ్య క్యాన్సర్ బారినపడింది. పోరాడి క్యాన్సర్ నుంచి బయటపడి నిజమైన యోధురాలిగా నిలిచింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో పలు టీవీ షోలకు జడ్జీగా వ్యవహరిస్తోంది. అయితే.. ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో సోనాలి బింద్రేను ఎన్టీఆర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారట అని అడిగితే… ఆమె ఆశ్చర్యపోయింది. ఈ విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు. నా దగ్గరకు అయితే.. ఎవరు రాలేదు. నన్ను సంప్రదించలేదు అని సమాధానం చెప్పింది. దీంతో ఎన్టీఆర్ మూవీలో సానాలి నటించడం అనేది నిజం కాదని తెలిసింది. మరి… ఈ సినిమాలో కీలక పాత్ర ఉంటే.. ఆ పాత్రను ఎవరితో చేయిస్తారో చూడాలి.
Also Read : అంచనాలు పెంచేసిన ఎన్టీఆర్-31 పోస్టర్