Saturday, November 23, 2024
Homeసినిమామరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్

మరోసారి దాతృత్వం చాటుకున్న సోనూసూద్

ఖమ్మం జిల్లాకు చెందిన కంచెపోగు కృష్ణ, బిందుప్రియ దంపతులకు ఈ ఏడాది ఓ బాబు పుట్టాడు. ఆ బాబు పుట్టుకతోనే గుండెల్లో సమస్య ఏర్పడింది. దీనిని గుర్తించిన వైద్యులు.. ఆపరేషన్ చేసేందుకు రూ. ఆరు లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు. కృష్ణ ఓ ప్రైవేటు ఉద్యోగి కావడంతో చిన్నారి వైద్యం కోసం అంత డబ్బు లేకపోవడంతో తల్లడిల్లిపోయాడు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా తిరువూరులో ఉన్న జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు తెలుసుకుని సినీనటుడు సోనూసూద్‌కు తెలిపారు.

దీని పైన వెంటనే స్పందించిన సోనూసూద్.. వారిని ముంబై రప్పించుకున్నారు. ముంబైలోని వాడియా ఆస్పత్రిలో ఆ బాబుకు గుండె ఆపరేషన్‌ చేయించారు. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం కూడా బాగుందని వైద్యులు వెల్లడించారు. వెంటనే స్పందించి చిన్నారికి ఊపిరి పోసినందుకు గాను సోనూసూద్ కి కృష్ణ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్