Sunday, January 19, 2025
HomeTrending Newsత్వరలో ఇథనాల్ ఫ్యాక్టరీ - మంత్రి కొప్పుల

త్వరలో ఇథనాల్ ఫ్యాక్టరీ – మంత్రి కొప్పుల

Ethanol Manufacturing Factory In Jagityala  :

జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామ పరిధిలో త్వరలో 700 కోట్లతో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మంగళవారం మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ధర్మపురి నియోజకవర్గంలో 7వందల కోట్లతో నెలకోల్పనున్న ఇథనాల్ రైస్ బ్రాంన్ ఆయిల్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన స్థలాన్ని క్రిశాంత్ భారతీ కో ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిభ్ కో) చైర్మన్, డైరెక్టర్లు, వైస్ చైర్మైన్లు పరిశీలించారు.

ఈ ఫ్యాక్టరీ సుమారు 7 వందల కోట్లతో ఇథనాల్, రైస్ బ్రాన్ ఆయిల్ తయారి పరిశ్రమలను నెలకోల్పడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో, జిల్లా కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులతో కలిసి, ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామంలోని 1090 సర్వే నెంబరు ప్రభుత్వ భూమి (బంచరాయి) లోని 413 ఎకరాల 12 గుంటల భూమి నుండి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కొరకు సుమారు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని పరిశీలించారు. అనంతరం రాయపట్నం బ్రిడ్జి వద్ద గోదావరి నీటి నిలువలు పరిశీలించారు.

అనంతరం క్రిభ్ కో చైర్మన్ డా చంద్రపాల్ సింగ్ మాట్లాడుతూ దేశంలో 3 ప్రదేశాలలో ఇథనాల్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నామని, గుజరాత్ రాష్ట్రంలో సూరత్, ఆంధ్రప్రదేశ్ లో కృష్ణపట్నం, తెలంగాణలో ప్రభుత్వం సూచించిన వెల్గటూర్ మండలంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 700 కోట్ల పెట్టుబడితో త్వరలో పనులు ప్రారంభిస్తామని, ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రతి సంవత్సరం 8 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారు చేస్తామని, దీనికోసం ప్రతి సంవత్సరం దాదాపు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల నూకలు, చెడిపోయిన బియ్యం, మక్కలు కొనుగోలు చేస్తామని అన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రజలు స్వాగతించి సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ జి.రవి, డా.సునిలకుమార్ సింగ్, డా.బిజేంద్రసింగ్, పొన్నం ప్రభాకర్, వి.ఎస్.ఆర్.రెడ్డి, రాంరెడ్డి, డి.పి.రెడ్డి, కంపెనీ ప్రతినిధులు, DCMS ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,‌ ఆర్.డి.ఓ.మాధురి, సంబంధించిన అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read : బంగ్లా-త్రిపుర సరిహద్దుల్లో భారీగా పేలుడు సామాగ్రి

RELATED ARTICLES

Most Popular

న్యూస్