Sunday, January 19, 2025
HomeTrending Newsసీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ యాదవ్‌ భేటీ

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌.. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఇరువురు నేతలు దేశంలోని తాజా పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల గురించి ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ప్రత్యామ్నాయ కూటమి, ప్రాంతీయ పార్టీల అవసరం గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తున్నది. దేశవ్యాప్తంగా పదిరోజుల పాటు సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు.

Akhilesh Yadav Meets Kcr

ఇందులో భాగంగా నేడు పలువురు రాజకీయ, ఆర్థిక, జాతీయ మీడియా ప్రముఖులతో కేసీఆర్‌ సమావేశమవనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శిస్తారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్,లోక్ సభ సభ్యులు నామా నాగేశ్వరరావు,రంజిత్ రెడ్డి,వెంకటేష్ నేత,ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితులున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం ఆధర్వర్యంలో నడుస్తున్న.. ఆఫ్రికా ఎవెన్యూ మార్గ్ లోని.. మహమ్మద్ పూర్ ‘మొహల్లా క్లినిక్ ’ను, దక్షిణ మోతీబాగ్ సర్వోదయ పాఠశాలను, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి నేటి సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సందర్శించనున్నారు. వాటి పనితీరును పరిశీలించనున్నారు

Also Read : అన్నదాతలు, సైనికుల కోసం కెసిఆర్ టూర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్