Sunday, September 8, 2024
HomeTrending NewsThis is not Cinema: మీసం తిప్పిన బాలయ్య- స్పీకర్ హెచ్చరిక

This is not Cinema: మీసం తిప్పిన బాలయ్య- స్పీకర్ హెచ్చరిక

సినిమాల్లో తరచూ మీసం తిప్పి డైలాగులు  చెప్పే హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో మీసం తిప్పి స్పీకర్ ఆగ్రహానికి గురయ్యారు. సభలో మీసాలు తిప్పడం లాంటి వికృత చేష్టలకు పాల్పడకూడదని, మొదటి తప్పుగా వదిలేస్తున్నామని తమ్మినేని సీతారాం బాలయ్యను హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేడు మొదలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై వెంటనే చర్చ చేపట్టాలని తెలుగుదేశం పార్టీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యం చేసుకుంటూ ఈ అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, సరైన ఫార్మాట్ లో రావాలని టిడిపికి సూచించారు. ఆ తర్వాత మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ టిడిపి ఎమ్మెల్యేల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు తమ పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.

ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ , అంబటివైపు చూస్తూ మీసం తిప్పారు.  బాలకృష్ణ వెళ్లి సినిమాల్లో మీసాలు తిప్పుకోవాలని ఇక్కడ కాదని అంబటి బదులిచ్చారు.  ఆ వెంటనే వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి బాలయ్య వైపు చూస్తూ తోడకొట్టారు.  తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో  సభను స్పీకర్ వాయిదా వేశారు.

తిరిగి సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ… సభ్యులంతా సంప్రదాయాలను గౌరవించాలని, కానీ టిడిపి సభ్యులు సభా స్థానాన్ని అగౌరవ పరిచేలా కాగితాలు విసిరారని,  మైకులు విరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సభా ఔన్నత్యాన్ని కించపరిచేలా తొడలు చరచడం, మీసాలు మేలీయడం లాంటి చర్యలు చేయకూడదని హితవు పలికారు. మీసం తిప్పడం ద్వారా నందమూరి బాలకృష్ణ సభా సంప్రదాయాలకు తిలోదకాలిచ్చారని, ఇది మొదటి తప్పిదంగా భావించి హెచ్చరిక జారీ చేస్తున్నామని స్పష్టం చేశారు.

స్పీకర్ స్థానం వద్ద బల్లలు చరిచి, మానిటర్ ను ధ్వంసం చేసేందుకు యత్నించిన అనగాని సత్య ప్రసాద్, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, సభలో వీడియో తీసిన పయ్యావుల కేశవ్ లను మొత్తం సెషన్ అయ్యే వరకూ సస్పెండ్ చేశారు. మిగిలిన టిడిపి సభ్యులు నేడు ఒక్కరోజు పాటు సస్పెండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్