Sunday, January 19, 2025
HomeTrending Newsలబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్

లబ్దిదారుల ఎంపికకు ప్రత్యేక డ్రైవ్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం నాయి బ్రాహ్మణుల, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై అధికారులతో బిఆర్ కెఆర్ భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ పథకం కింద ఇప్పటి వరకు 28,550 మంది ధరఖాస్తు చేసుకోగా 10,637 ధరఖాస్తులు రజకుల కమ్యూనిటీ నుండి, 17913 ధరఖాస్తులు నాయిబ్రాహ్మణుల కమ్యూనిటీ నుండి స్వీకరించడం జరిగింది. ఈ పథకానికి లబ్ధిదారులు తమ పేర్లు నమోదుచేసుకోవడానికి జిల్లా కలెక్టర్లు, బిసి సంక్షేమ అధికారులు ప్రత్యేక డ్రైవ్ ను నిర్వహించాలని ఆదేశించారు. లబ్ధిదారులు తమ ధరఖాస్తులను ఉచితంగా మీ సేవా కేంద్రాలలో నమోదు చేసుకునేలా సౌకర్యాన్ని కల్పించాలని ఐటి అధికారులను ఆదేశించారు. సిజిజి లో రిజిష్ట్రరు చేసుకున్న ధరఖాస్తులను సంబంధిత అధికారులు వెంటనే సంబంధిత Discom లకు పంపించి ఉచిత విద్యుత్ పథకాన్ని పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం జివో. ఎంస్. నెం. 2 తేది 04-04-2021 బిసి వెల్పేర్ (డి) డిపార్ట్ మెంట్ ద్వారా జారీ చేయడంతో పాటు నియమనిబంధనలు కూడ విడుదల చేసింది.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణారావు, బిసి వెల్ఫేర్ కార్యదర్శి రాహుల్ బొజ్జా, విద్యుత్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి  సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, TSSPDCL, CMD రఘుమారెడ్డి, బిసి వెల్ఫేర్ అడిషనల్ సెక్రటరీ సైదా, వాషర్ మెన్ ఎండి చంద్రశేఖర్, నాయి బ్రాహ్మణ్ ఎంసి. Ms. విమల మరియు తదతర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్