Sunday, January 19, 2025
HomeసినిమాPushpa 2: 'పుష్ప' ఎక్కడ? ఇంట్రస్టింగ్ గా పుష్ప 2 గ్లిమ్స్

Pushpa 2: ‘పుష్ప’ ఎక్కడ? ఇంట్రస్టింగ్ గా పుష్ప 2 గ్లిమ్స్

అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన  పుష్ప సృష్టించిన రికార్డులు, కలెక్షన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులపై ఈ సినిమా చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు.  పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటించిన తీరు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మాడ్యుకేషన్, యాటిట్యూడ్ ఇవన్నీ తెలుగు ప్రేక్షకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.  క్రికెటర్స్,  రాజకీయ నాయకులు కూడా ఈ సినిమాల్లోని డైలాగులు తమదైన స్టైల్ లో చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు.

దీనికి సీక్వెల్ గా వస్తోన్న ‘పుష్ప 2’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ  మూవీ గ్లిమ్స్ ను విడుదల చేశారు. “తిరుపతి జైలు నుండి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప” అని న్యూస్ వినిపిస్తుంది. ఆ తరువాత “అసలు పుష్ప ఎక్కడ” అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను ఆసక్తికరంగా కట్ చేశారు. దీని పూర్తి వీడియోను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే కానుకగా ఏప్రిల్ 7న సాయంత్రం 4:05 నిమిషాలకు  విడుదల చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్