Monday, February 24, 2025
HomeTrending Newsగాంధీ ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలు

గాంధీ ఘటనపై ప్రత్యేక పోలీసు బృందాలు

గాంధీ ఆసుపత్రి ఘటనపై ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రులు సీరియస్ అయ్యారు. గాంధీ ఆసుపత్రి ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ , ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ లు సంబంధిత అధికారులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదారాబాద్ లోని హోం మంత్రి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పోలీసు కమీషనర్ అంజనీ కుమార్, అడిషనల్ కమీషనర్ శ్రీమతి శీఖా గోయల్ ,డిసిపి కల్మేశ్వర్, గాంధీ ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు తదితర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగామంత్రులు మాట్లాడుతూ ఈ ఘటన పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని,వేగంగా పరిష్కరించాలని, చట్ట పరంగా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని మంత్రులు పోలీసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో పట్టుకుంటామని పోలీసు కమీషనర్ ఈ సందర్భంగా అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్