Saturday, September 21, 2024
HomeTrending NewsGurukul Trust: విశాఖ, పులివెందుల, తిరుపతిల్లో విద్యా సంస్థలు

Gurukul Trust: విశాఖ, పులివెందుల, తిరుపతిల్లో విద్యా సంస్థలు

రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, పులివెందులలో ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ ట్రస్ట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. ట్రస్ట్ సభ్యులు, ప్రతినిధులు నేడు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌  మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు.

రాష్ట్రంలో విద్యారంగం అభివృద్దికి అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం, ఇంటర్నేషనల్‌ స్కూల్స్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు  అంగీకారం తెలిపారు. ట్రస్ట్  కు ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని హామీ ఇచ్చారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో తమ ట్రస్ట్‌కు 100 ఎకరాల భూమిని కేటాయించడంతో అత్యంత ప్రతిష్టాత్మకమైన స్వామినారాయణ్‌ గురుకుల్‌ యూనివర్శిటీని ఏర్పాటుచేసి అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నట్లు సీఎంకి వివరించిన ప్రతినిధుల బృందం. శ్రీ స్వామినారాయణ్‌ గురుకుల్‌ గ్రూప్‌కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, చత్తీస్‌గడ్, రాజస్ధాన్, న్యూఢిల్లీ, యూఎస్‌ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో 52 కు పైగా విద్యాసంస్ధలు ఉన్నాయని వెల్లడించారు.

ఈ సమావేశంలో  ట్రస్టీ మెంబర్‌ సుఖ్‌వల్లభ్‌ స్వామి, విజయవాడ బ్రాంచ్‌ ఆర్గనైజర్‌ మంత్రస్వరూప్‌ స్వామి, ట్రస్ట్‌ సభ్యులు శ్రవణ్‌ప్రియ్‌ స్వామి, విషుద్జీవన్‌ స్వామి, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్