Saturday, January 18, 2025
HomeసినిమాSree Vishnu: 'బెదురులంక' హిట్ సినిమా.. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి - శ్రీవిష్ణు

Sree Vishnu: ‘బెదురులంక’ హిట్ సినిమా.. థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి – శ్రీవిష్ణు

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘బెదురులంక 2012’. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రవీంద్ర (బెన్నీ) బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం గత వారం విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ విజయోత్సవ సభను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువ హీరో శ్రీ విష్ణు, దర్శకుడు అజయ్ భూపతి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘క్లాక్స్ నాకు 2009 నుంచి పరిచయం. నాకు ఈ కథ 2009లోనే తెలుసు. క్లాక్స్ నాకు కథలు అప్పటి నుంచి చెబుతూనే ఉండేవాడు. క్లాక్స్ ఎంతో కష్టపడ్డాడు. డిఫరెంట్ కాన్సెప్టుల్లో నటించడం, చేయడం కాస్త కష్టం. నిర్మాతలు ముందుకు రారని క్లాక్స్‌కి చెప్పాను. కమర్షియల్ ఫార్మాట్లో సినిమాను చేయమని చెప్పాను కానీ.. బెన్ని లాంటి నిర్మాతలు ఇప్పుడు ఉన్నారు. కొత్త కథలను ప్రోత్సహిస్తున్నారు. క్లాక్స్ దగ్గరున్న అద్భుతమైన కథలను ఫాస్ట్ ఫాస్ట్‌గా చేయాలని కోరుకుంటున్నాను. మణిశర్మ గారి పనితనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నేహా శెట్టి పేరు నాకు తెలీదు. రాధిక మాత్రమే తెలుసు. ఇప్పుడు చిత్ర అంటున్నారు. ఇలా పాత్రల పేరుతో గుర్తుండేలా నటించడం మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో నేను చాలా తక్కువగా ఉంటాను. ఆర్ఎక్స్ 100 పిల్లా రా పాట విని షాక్ అయ్యాను. అందులో కార్తికేయను చూసి ట్వీట్ వేశాను. ఆర్ ఎక్స్ 100 సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కొత్త కొత్త పాత్రలు చేస్తూనే ఉన్నాడు. పెద్ద హిట్ పడాలని అనుకున్నాను. ఇప్పుడు బెదురులంకతో హిట్ కొట్టేశాడు. కార్తికేయ నాకు చాలా ఇష్టం. ఆయన్ను చూస్తే నాకు సోదరభావం కలుగుతుంది. ఈ సినిమాను ఇంకా చూడని వాళ్లుంటే థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి’’ అని అన్నారు.

అజయ్ భూపతి మాట్లాడుతూ… ‘‘సినిమా టీంకు కంగ్రాట్స్. ఆర్ఎక్స్ 100 అందరికీ లైఫ్ ఇచ్చింది. కానీ నాకు లైఫ్ ఇచ్చింది మాత్రం కార్తికేయ. ఆ సినిమాను నిర్మించింది ఆయనే. కార్తికేయకు హిట్ వస్తే నాకు కూడా హిట్ వచ్చినట్టే. ఆయనకు విజయం రావడం నాకు ఆనందంగా ఉంది. క్లాక్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఆర్జీవీ దగ్గర నుంచి నేను బయటకు వస్తుంటే… క్లాక్స్ ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. క్లాక్స్‌కు ఇంత మంచి హిట్ రావడం ఆనందంగా ఉంది. అన్ని పాత్రలను బాగా చూపించాడు. పెద్ద హీరోలుంటే థియేటర్లకు వెళ్లాలని ప్రేక్షకులు ఆలోచించడం లేదు. సినిమా బాగుంటేనే వెళ్తున్నారు. అలాంటి ప్రేక్షకులు ఉండటం మన అదృష్టం. టీం అందరికీ కంగ్రాట్స్ అండ్ థాంక్స్. మా కార్తికేయకు హిట్ ఇచ్చినందుకు అందరికీ థాంక్స్’’ అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్