Sunday, January 19, 2025
Homeసినిమాప్రేక్ష‌కుల ఆశీస్సులు ఇలాగే ఉండాలి : శ్రీవిష్ణు

ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఇలాగే ఉండాలి : శ్రీవిష్ణు

యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘రాజ రాజ చోర‌’. మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్స్‌. హసిత్‌ గోలి ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగ‌స్ట్ 19న సినిమా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో హీరో శ్రీవిష్ణు, డైరెక్ట‌ర్ హ‌సిత్ గోలి, న‌టుడు ర‌విబాబు, హీరోయిన్స్ మేఘా ఆకాశ్‌, సునైన, నైజాం, ఆంధ్ర‌, సీడెడ్ డిస్ట్రిబ్యూట‌ర్స్‌ పాల్గొన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ… సినిమా అనుకున్న‌ప్పుడు కుమార్ చౌద‌రి గారి ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. అలా పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీకి వెళ్లి వివేక్‌ గారిని క‌లిశాం. త‌ర్వాత అభిషేక్ అగ‌ర్వాల్‌ గారిని క‌లిశాం. వ‌ర్క్ స్టార్ట్ అయిన త‌ర్వాత టీమ్‌కు చాలా ఫ్రీడ‌మ్ ఇచ్చి వ‌ర్క్ చేయించుకున్నారు. ఇలాంటి టీమ్‌తో క‌లిసి ప‌ని చేయ‌డం నిజంగా అదృష్టం. రెండుసార్లు పాండ‌మిక్ వ‌చ్చిన‌ప్పుడు నిర్మాత‌లు ఎంతో సపోర్ట్ అందించారు. టీమ్‌లో అంద‌రూ త‌మ సినిమా అనుకుని ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. వేద సినిమాకు ఏది బెస్ట్ అవుతుంద‌ని అనుకున్నాడో దాన్ని ఇచ్చాడు. సినిమా చేసే స‌మ‌యంలోనే డిఓపికి మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకున్నాం. మేం అనుకున్న‌ది నిజ‌మైంది.

అలాగే విప్ల‌వ్ కూడా ఎక్స్‌ట్రార్డిన‌రీ ఔట్‌పుట్ ఇచ్చాడు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్‌ను ఎప్పుడు క‌లిసినా, సినిమా గురించి మాట్లాడిన‌ప్పుడు త‌న‌కు ఏం ఇవ్వాలో తెలుసు. దాన్ని హండ్రెడ్ ప‌ర్సెంట్ ఇచ్చేస్తాడు అనుకున్నాను అలాగే ఇచ్చాడు. ఇలా ‘రాజ‌ రాజ‌ చోర’ స‌క్సెస్‌లో భాగ‌మైన టెక్నీషియ‌న్లకు థాంక్స్. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. హీరోయిన్స్ సునైన‌, మేఘా ఆకాశ్ సినిమాను ఎంత వ‌ర‌కు న‌మ్మారో తెలియ‌దు. కానీ.. నేను, హ‌సిత్ అయితే హీరోయిన్లకు చాలా మంచి పేరు వ‌స్తుంద‌ని అనుకున్నాం. ఇద్ద‌రు చాలా బాగా చేశారు. సినిమా సూప‌ర్ హిట్ వ‌చ్చింది. అందుకు హీరోయిన్లకు కూడా థాంక్స్‌.

ఇక ర‌విబాబు గారు, భ‌ర‌ణి గారు, కాదంబ‌రికిర‌ణ్‌ గారు, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఇలా అంద‌రూ చ‌క్క‌టి స‌పోర్ట్ ఇచ్చారు. ర‌విబాబు గారు ఈ సినిమాకు హీరో అనాలి. హీరోయిన్స్‌, ర‌విబాబు గారు, గంగ‌వ్వ, శ్రీకాంత్ అయ్యంగార్ గారు ఏం చేశారో దానికి నేను రియాక్ట్ అయ్యానంతే. నేను చేసిందేమీ లేదు. వాళ్ల‌ని హీరోలుగా ఫీలయ్యే ఈ సినిమా మేం చేశాం. ఎందుకంటే పాత్ర‌లు అలాంటివి మ‌రి. సాధార‌ణంగా ఓ సినిమాలో రెండు, మూడు పాత్ర‌లు బావుంటాయి. కానీ.. సినిమాలో చేసిన ప్ర‌తి పాత్ర అదిరిపోయింది. అలాంటి పాత్ర‌ల‌ను క్రియేట్ చేసిన ద‌ర్శ‌కుడు హ‌సిత్ గ్రేట్‌. ఈ క‌థ ఇంత బాగా రావ‌డానికి వివేక్ ఆత్రేయ ఓ మెంట‌ర్‌లాగా ఉండి న‌డిపించాడు.

క‌రోనా టైమ్‌లో త‌ను చేస్తున్న సినిమాల‌కు సంబంధించిన క‌థ‌లు రాసుకుంటూ, మాకు ఫోన్ చేసి మా క‌థ గురించి డిస్క‌స్ చేస్తూ మాకెంతో స‌పోర్టుగా నిలిచాడు. త‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. సినిమా చేసిన త‌ర్వాత రిలీజ్ అని ఓ వారం ముందు మాత్ర‌మే అనుకున్నాం. అయితే మీడియా ఎంత‌గానో సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకెళ్లింది. చాలా రోజులు ఈ సినిమా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో నిలిచిపోయే చిత్ర‌మిది. ఇంకా మంచి సినిమాలు చేస్తాను. ప్రేక్ష‌కుల ఆశీస్సులు ఇలాగే ఉండాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్