రష్మిక స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. అలాగే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లోను కుదురుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. ఈ బ్యూటీకి ఇన్ని భాషల్లోని అభిమానులలో మంచి క్రేజ్ ఉండటంతో, పాన్ ఇండియా సినిమాలు చేయాలనుకునేవారు ముందుగా ఆమెనే సంప్రదిస్తున్నారు. రష్మిక మందన్నకు ఇప్పుడు ఇమేజ్ బాగానే ఉంది. ఈ భామ కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు. తాజాగా బన్నీ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా ప్రస్తుతానికి తాను వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది.
ఒక వైపున తెలుగులో ‘పుష్ప 2’ వంటి భారీ ప్రాజెక్టు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ .. సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు – తమిళ భాషల్లో రూపొందుతున్న ‘రెయిన్ బో’ సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నదే.
ఇవి కాకుండా రెండు హిందీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఇక నితిన్ – వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని భావించిన ఆమె, ఆ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. గతంలో నితిన్ – రష్మిక కాంబినేషన్లో వచ్చిన ‘భీష్మ’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి మేజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని అనుకుంటే, రష్మిక ఇలా హ్యాండ్ ఇచ్చేసింది.
ఈ నేపథ్యంలో నితిన్-వెంకీ సినిమాకు డేట్లను కేటాయించడం రష్మిక కు కుదరడం లేదు. దీంతో చిత్ర బృందంతో చర్చించిన తరువాత ఈ సినిమా నుంచి రష్మిక తప్పుకున్నట్లు వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోండగా చిత్రబృందం మరో హీరోయిన్ వేటలో పడినట్లు తెలుస్తోంది. రష్మిక తప్పుకోవడంతో శ్రీలీల చిత్రానికి సైన్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.