Friday, February 28, 2025
HomeTrending Newsశ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత బి.ఎస్‌. రావు కన్నుమూత

శ్రీ చైతన్య విద్యాసంస్థల ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ బొప్పన సత్యనారాయణ రావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 75 సంవత్సరాలు. అనారోగ్యంతో హైదరాబాద్ లో తుది శ్వాస విడిచారు. బీఎస్ రావు భౌతిక కాయాన్ని స్వస్థలం అయిన విజయవాడకు తరలిస్తున్నారు.జూలై 14 విజయవాడలో బీఎస్ రావు అంత్యక్రియలు జరగనున్నాయిబొప్పన సత్యనారాయణ రావు తొలినాళ్లలో యూకే, ఇరాన్ లో డాక్టర్ గా పని చేశారు. అనంతరం భార్యతో కలిసి 1986లో శ్రీ చైతన్య విద్యాసంస్థలను స్థాపించారు.

అందులో భాగంగా తొలుత విజయవాడలోనే తొలి జూనియర్ కాలేజీని పెట్టారు. విజయవాడ నుంచి నెమ్మదిగా తమ కాలేజీలను పెంచుకుంటూ పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వీరి కాలేజీలు నెలకొల్పారు. మొత్తం 321 జూనియర్ కాలేజీలు, 322 శ్రీ చైతన్య టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను వీరు నడుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్