Sunday, September 29, 2024
Homeసినిమాశ్రీలీల దూకుడు మామూలుగా లేదే!

శ్రీలీల దూకుడు మామూలుగా లేదే!

Lovely Leela: ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్ లో టాప్ త్రీ జాబితాను తీసుకుంటే, పూజ హెగ్డే .. రష్మిక మందన .. కీర్తి సురేశ్ కనిపిస్తున్నారు. ఏ స్టార్ హీరో సరసన చూసినా ఇప్పుడు వీరి పేరే వినిపిస్తోంది .. కనిపిస్తోంది. చాలా రోజులుగా ఈ ముగ్గురు భామల చుట్టూనే పెద్ద సినిమాలు తిరుగుతున్నాయి. వాళ్లు అడిగినంత పారితోషికాన్ని ముట్టజెబుతున్నాయి. ఆ తరువాత లైన్లో కృతి శెట్టి .. శ్రీలీల కనిపిస్తున్నారు. కృతి శెట్టి ఇలా ‘ఉప్పెన’తో ఎంట్రీ ఇచ్చిందో లేదో, అలా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని గోల్డెన్ లెగ్ అనిపించుకుంది.

ఆ తరువాత వచ్చిన శ్రీలీల అదే స్థాయిలో దూకుడు చూపుతుండటం విశేషం. ‘పెళ్లి సందD’ సినిమాతో ఈ సుందరి తెలుగు  తెరకి పరిచయమైంది. ఆ సినిమా ఆశించిన స్థాయిని అందుకోలేకపోయినా, గ్లామర్ పరంగా ఈ బ్యూటీ నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ప్రస్తుతం ఆమె రవితేజ సరసన ‘ధమాకా’ సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగు జరుగుతూ ఉండగానే, చకచకా మిగతా ప్రాజెక్టులను ఆమె లైన్లో పెట్టేసింది.ఆశిష్ హీరోగా రూపొందుతున్న ‘సెల్ఫిష్’ సినిమాలోనూ కథానాయికగా ఆమెనే తీసుకున్నారు.

ఇక వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా చేయనున్న సినిమాలోను శ్రీ లీలనే ఎంపిక చేశారు. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత ఈ సినిమా సెట్స్  పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇక గాలి జనార్ధన రెడ్డి తనయుడు  హీరోగా చేయనున్న సినిమాలోనూ హీరోయిన్ గా శ్రీలీలకే  అవకాశం దక్కినట్టుగా చెబుతున్నారు. త్వరలో సెట్స్  పైకి వెళ్లనున్న వైష్ణవ్ తేజ్ సినిమాలోను .. నవీన్  పోలిశెట్టి సినిమాలలోను శ్రీలీలనే సందడి చేయనుందని సమాచారం. అందం .. అభినయంతో పాటు డాన్స్ విషయంలోను అమ్మడికి వంక బెట్టనవసరం లేకపోవడంతో, వరుస ప్రాజెక్టులతో శ్రీ లీల తన దూకుడు చూపుతుండటం విశేషం.

Also Read : శ్రీలీల‌కు బంప‌ర్ ఆఫ‌ర్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్