Tuesday, September 24, 2024
Homeసినిమాసుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ 'శ్రీ‌రంగ‌నీతులు' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుదల….

సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ‘శ్రీ‌రంగ‌నీతులు’ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుదల….

సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తోన్న చిత్రం ‘శ్రీ‌రంగ‌నీతులు’. ఇటీవ‌ల విడుద‌లైన టైటిల్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ రాగా ఈ రోజు (జూన్ 29) తొలి ఏకాద‌శి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది.

సుహాస్, కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మల‌తో కూడిన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ సినిమాపై మ‌రింత ఇంట్ర‌స్ట్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రాన్ని రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ విఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని థియేట‌ర్స్‌లో రిలీజ్ చేయ‌నున్నారు మేక‌ర్స్‌.హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్