Friday, March 20, 2026
Homeసినిమాశ్రీ సింహా కొత్త చిత్రం 'భాగ్ సాలే' ఫస్ట్ లుక్ విడుదల

శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ విడుదల

యువ హీరో శ్రీ సింహా కొత్త చిత్రం ‘భాగ్ సాలే’ ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. ప్రణీత్ సాయి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్  బ్యానర్ల పై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్నారు. టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ… “యువ హీరో శ్రీ సింహా, అర్జున్ పాత్రలో నటిస్తుండగా నేహా సొలంకి హీరోయిన్ గా; జాన్ విజయ్, నందిని రాయ్ లు ప్రతినాయక పాత్రలు చేస్తున్నారు. ఏం చేసైనా అనుకున్నది సాధించాలనుకునే ఒక యువకుడి పాత్ర చుట్టూ తిరిగే ఈ కథ ఆద్యంతం  థ్రిల్  కలిగిస్తుంది. రాజీవ్ కనకాల, వైవా హర్ష, సత్య, సుదర్శన్, వర్షిణి తదితరులు నటిస్తున్నారు, చిత్ర విజయం పై మాకు పూర్తి నమ్మకముంది.” అన్నారు.  కాల భైరవ సంగీతం అందిస్తుండగా, ఎడిటింగ్ కార్తీక ఆర్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ రమేష్ కుషేందర్ చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటూ విడుదలకి సిద్ధంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular