Wednesday, March 11, 2026
Homeసినిమా‘సామజవరగమన’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - శ్రీ విష్ణు

‘సామజవరగమన’ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు – శ్రీ విష్ణు

శ్రీవిష్ణు కథానాయకుడిగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌ పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

శ్రీవిష్ణు మాట్లాడుతూ.. సామజవరగమన లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. సినిమా జనాల్లోకి వెళ్ళిపోయింది. అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. యూఎస్ లో కూడా దుమ్మురేపుతుంది. దర్శకుడు కథ చెప్పినపుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైయింది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు. నిర్మాత అనిల్ గారిని చూడగానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇందులో నరేష్ గారి పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు. ఒకవేళ నేను భవిష్యత్ లో సెకండ్ ఇన్నింగ్ మొదలుపెడితే.. నరేష్ గారి పాత్రని చేస్తాను. ఒక ఫ్యామిలీ లానే ఈ సినిమా చేశాం. ప్రతి నటుడి దగ్గర చాలా నేర్చుకున్నాను. హీరోయిన్ రెబ్బా చాలా మంచి నటి. తనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిర్మాత రాజేష్ గారు చాలా పాజిటివ్ గా వుంటారు. నాకు చాలా నచ్చారు. ఎక్కడా రాజీ పడకుండా సినిమా నిర్మించారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడానికి వెళ్ళినపుడు చిరంజీవి గారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్ గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది. ఈ వేడుకకి   వచ్చిన దర్శకులు మెహర్ రమేష్ గారికి, వశిష్ట, విజయ్ కనకమేడల, హసిత్ అందరికీ థాంక్స్. మాకు ఎంతో సహకరించిన  మీడియాకి కృతజ్ఞతలు. మా పీఆర్వో వంశీ శేఖర్ కి కృతజ్ఞతలు. ఈ సినిమా ఇంకా చాలా రోజులు థియేటర్ లో ఆడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular