Friday, March 20, 2026
Homeసినిమావెన‌క్కి త‌గ్గిన శ్రీవిష్ణు

వెన‌క్కి త‌గ్గిన శ్రీవిష్ణు

Bhala Postponed: మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల క్రేజీ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ ఆచార్య ఈ నెల 29న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే.. ఆచార్య సినిమా రిలీజ్ అవుతున్న‌ప్ప‌టికీ.. ఆత‌ర్వాత రోజున అంటే ఏప్రిల్ 30న‌ శ్రీవిష్ణు.. భ‌ళా తంద‌నాన చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించి అంద‌రికీ షాక్ ఇచ్చాడు.

ఈ చిత్రానికి చైత‌న్య దంత‌లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ సినిమా శ్రీవిష్ణుకు ఖ‌చ్చితంగా విజ‌యం అందిస్తుంద‌నే న‌మ్మ‌కాన్ని ఏర్ప‌రిచింది. అయితే.. ఈ నెల 30న ఈ సినిమాని విడుదల చేయాలని నిర్మాతలు అనుకోవడం సరైన నిర్ణయం కాదని కొందరు అభిప్రాయపడ్డారు. తాజా సమాచారం ప్రకారం.. భళా తందనాన నిర్మాతలు ఇప్పుడు రిలీజ్ విషయంలో పునరాలోచనలో పడ్డారని తెలిసింది.

అందుకే భళా తందనాన మూవీ ప్రమోషన్స్‌కు కూడా బ్రేక్ ఇచ్చారు. రిలీజ్ చేయాల్సిన లిరికల్ వీడియోను, ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను రద్దు చేశారు. దీనిని బట్టి చూస్తుంటే.. భ‌ళా తంద‌నాన చిత్రాన్ని 30న రిలీజ్ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో సరికొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాతలు ప్రకటించే అవకాశం ఉన్నట్టు స‌మాచారం.

Also Read : ‘ఆచార్య’ కు మ‌హేష్ ‘మాట’ సాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular