Wednesday, March 11, 2026
Homeసినిమా'రాజ రాజ చోర' విడుదల తేదీ ఖరారు

‘రాజ రాజ చోర’ విడుదల తేదీ ఖరారు

యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన తాజా చిత్రం ‘రాజ రాజ చోర’. ఈ చిత్రానికి హసిత్ గోలీ దర్శకత్వం వహించారు. విభిన్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో విశేషంగా ఆకట్టుకుంది. కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్‌ పర్సెంట్ ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించింది. ఇటీవల ఈ మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేసిన టీమ్ ఇప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది.

ఈ నెల 19న థియేటర్లో ‘రాజ రాజ చోర’ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తేదీని తెలుపుతూ ‘కింగ్ సైజ్ ఎంటెర్టైమెంట్ గ్యారెంటీ’ అని పోస్టర్‌ను కూడా రిలీజ్ చేసింది. ఇందులో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్, సునయన నటించారు. ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతం అందించారు.  శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి, కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల, మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌, సినిమాటోగ్రఫీ: వేదరామన్‌, ఎడిటింగ్‌: విప్లవ్‌, ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే, స్టైలింగ్‌: శ్రుతి కొర్రపాటి, ప్రొడ్యూసర్స్‌: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌, రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular