Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్మీ విధానం ఏమిటి? కింజరాపు

మీ విధానం ఏమిటి? కింజరాపు

విశాఖ స్టీల్ ప్లాంట్ వ్రైవేటీకరణపై జగన్ ప్రభుత్వం తన విధానాన్ని స్పష్టంగా వెల్లడించాలని టిడిపి నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ రాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమి చేసినా ఎవరూ అడగలేరనే భావనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లుందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రానికే తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కాకూడదని, దీని కోసం సిఎం జగన్, వైఎస్సార్సీపీ ఎంపీలు గట్టిగా పోరాడాలని సూచించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న ఆందోళనలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అయన వెల్లడించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికైనా నిద్రలేచి అమ్మకాన్ని అడ్డుకోడానికి కృషి చేయాలని రామ్మోహన్ రాయుడు హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేసే ధైర్యం మాకుంది, రాష్ట్ర శ్రేయస్సు కోసం రాజీనామా చేసే సత్తా మీకుందా? అంటూ వైసీపీ ఎంపీలకు సవాల్ విసిరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్