Sunday, February 23, 2025
Homeసినిమావెంకీ, ర‌వితేజ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్..?

వెంకీ, ర‌వితేజ కాంబినేష‌న్లో భారీ మ‌ల్టీస్టార‌ర్..?

Venky-Ravi Teja: విక్ట‌రీ వెంక‌టేష్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ రావ‌డం.. బాక్సాఫీస్ ద‌గ్గ‌రవిక్ట‌రీ వెంక‌టేష్, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు.. వీరిద్ద‌రి కాంబినేష‌న్లో సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే భారీ మ‌ల్టీస్టార‌ర్ రావ‌డం.. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత నుంచి భారీ మ‌ల్టీస్టారర్ ల‌కు ఓ ఊపు వ‌చ్చింది. అయితే.. ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని అందించిన శ్రీకాంత్ అడ్డాల మ‌రో భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్లాన్ చేస్తున్నార‌ని.. టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటంటే… వెంకీ, ర‌వితేజ కాంబినేష‌న్లో ఓ భారీ మ‌ల్టీస్టార‌ర్ ను శ్రీకాంత్ అడ్డాల ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇప్పటికే వెంకటేష్ కి శ్రీకాంత్ అడ్డాల కథ చెప్పాడని, క‌ధ విని వెంకీ వెంట‌నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్త‌లు వస్తున్నాయి. అలాగే, త్వరలోనే రవితేజకు కూడా కథ వినిపించబోతున్నాడట. నిర్మాత దిల్ రాజు, వెంకీ – రవితేజ హీరోలుగా ఓ సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడట.

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేత మల్టీస్టారర్ కథ చేయించింది దిల్ రాజునే అని టాక్ నడుస్తోంది. దీంతో ఇద్దరి హీరోల కోసం శ్రీకాంత్ ఎలాంటి కథ రాశాడో అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రో వైపు శ్రీకాంత్ అడ్డాల బాల‌య్య కోసం కూడా ఓ ప‌వ‌ర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. బాల‌య్య‌తో శ్రీకాంత్ అడ్డాల మూవీ క‌న్ ఫ‌ర్మ్ అవుతుంది అనుకుంటే.. మ‌ల్టీస్టార‌ర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రి.. శ్రీకాంత్ అడ్డాల‌.. మ‌ల్టీస్టార‌ర్ మూవీ చేస్తాడో..?  బాల‌య్య‌తో మూవీ చేస్తాడో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read : ప‌వ‌న్, తేజు మ‌ల్టీస్టార‌ర్ సెట్స్ పైకి వ‌చ్చేది ఎప్పుడు..? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్