Thursday, March 19, 2026
Homeసినిమా‘భగత్ సింగ్ నగర్’ పాట విడుదల చేసిన శ్రీకాంత్

‘భగత్ సింగ్ నగర్’ పాట విడుదల చేసిన శ్రీకాంత్

Srikanth Released The 2nd Song From Bhagat Singh Nagar :

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకంపై విదార్థ్, ధృవిక హీరోహీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తులు నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమాలోని ‘ఈ విశ్వమంతము వ్యాపించిన’ పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ చేతుల మీదుగా నేడు విడుదలైంది.

శ్రీకాంత్ మాట్లాడుతూ “భగత్ సింగ్ నగర్…. ఆ పేరులో ఉండే పవర్ యాక్షన్.. టీజర్ లోను, ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేసిన ‘చరిత చూపని’ సాంగ్ లోను స్పష్టంగా కనపడుతోంది. అదే రేంజ్ లో ఏమాత్రం తగ్గకుండా ఈ ‘విశ్వంతము వ్యాపించిన’  పాట ప్రస్తుత పరిస్థితులకి అద్దం పట్టినట్టుగా ఉంది” అంటూ సినిమా బృందాన్ని ప్రశంసించారు. “ఒక కొత్త టీం…. కొత్త కథతో సినిమాలు తీయడం వారి మంచి ప్రయత్నాన్ని ప్రోత్సహించడం మన భాధ్య‌త‌గా భావించి ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మనకి వస్తాయి”అన్నారు.

“భగత్ సింగ్ నగర్ ఈ సినిమాలో నేను నెగటివ్ షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు కధే బలం. ఆ కథను దర్శకుడు క్రాంతి వాలాజా చాలా బాగా ప్రెజెంట్ చేశాడు. చాలా మంది కొత్త‌ నటీనటులు టెక్నిషియన్స్ తో పాటు సీనియర్ యాక్టర్స్ తో కలిపి ఒక మంచి సినిమాగా మన ముందుకు తీసుకు వస్తున్న గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సంస్థ‌ను అభినందిస్తున్నా, ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నా’ అని బెనర్జీ అన్నారు.

Also Read : త్వరలో రానున్న ‘భగత్ సింగ్ నగర్’

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular