Saturday, January 18, 2025
Homeసినిమాశ్రీను వైట్ల మల్టీ ‘స్టార్స్’ ఎవరు?

శ్రీను వైట్ల మల్టీ ‘స్టార్స్’ ఎవరు?

‘నీ కోసం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన.. శ్రీను వైట్ల తొలి సినిమాతోనే టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఆ తర్వాత ‘ఆనందం’, ‘సొంతం’, ‘వెంకీ’, ‘అందరివాడు’ చిత్రాలతో సక్సెస్ సాధించాడు. అయితే.. ఆ తర్వాత నుంచి కామెడీకి పెద్దపీట వేశాడు. ‘ఢీ’, ‘దుబాయ్ శీను’, ‘రెడీ’, ‘కింగ్’, ‘నమో వెంకటేశాయ’, ‘దూకుడు’, ‘బాద్ షా’ చిత్రాలతో కామెడీకి స్టార్ స్టేటస్ తీసుకువచ్చి ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. స్టార్ హీరోలతో సైతం కామెడీ చేయించడంతో.. ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ఆ సినిమాలకు అద్భుతమైన విజయాల్ని అందించారు.

అయితే.. శ్రీను వైట్ల తీసిన ‘ఆగడు’, ‘బ్రూస్ లీ’, ‘మిస్టర్’, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో శ్రీను వైట్ల కెరీర్ లో బాగా వెనకబడ్డారు. ఇప్పుడు ‘ఢీ అండ్ ఢీ’ అనే సినిమా తీస్తున్నారు. దీనికి డ‌బుల్ డోస్‌ అనేది ఉప‌శీర్షిక. విష్ణు క‌థానాయ‌కుడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. డ‌బుల్స్‌ అనే టైటిల్ తో శ్రీ‌నువైట్ల ఓ స్టోరీ రెడీ చేశారట. ఇదో మ‌ల్టీస్టార‌ర్‌. ఇందులో ఇద్ద‌రు స్టార్ హీరోలు నటించనున్నారని చెప్పారు కానీ.. ఆ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరనేది చెప్పలేదు. మరి.. శ్రీను వైట్ల మల్టీస్టారర్ లో నటించే ఆ ఇద్దరు ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్