Saturday, January 18, 2025
Homeసినిమా‘భ‌ళా తంద‌నాన’లో గ‌రుడ‌రామ్ లుక్ విడుద‌ల‌

‘భ‌ళా తంద‌నాన’లో గ‌రుడ‌రామ్ లుక్ విడుద‌ల‌

టాలీవుడ్‌లో అతి త‌క్కువ మంది నటులు మాత్రమే అసాధారణమైన స్క్రిప్ట్ ఎంచుకుంటూ విభిన్న క‌థా చిత్రాల‌లో న‌టిస్తుంటారు వారిలో శ్రీ‌విష్ణు ఒక‌రు. ప్ర‌స్తుతం ‘బాణం’ ఫేమ్ చైతన్య దంతులూరి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు హీరోగా న‌టిస్తోన్న చిత్రం `భ‌ళా తంద‌నాన‌`. ప్ర‌ముఖ నిర్మాణ‌సంస్థ వారాహి చ‌ల‌న‌చిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మిస్తున్నారు.

శ్రీ విష్ణు స‌ర‌స‌న కేథ‌రిన్ థ్రెసా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ‘గ‌రుడ రామ్’ విల‌న్‌గా న‌టిస్తున్నారు. ఈ రోజు గ‌రుడ‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అతని లుక్‌ని విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో ఆనంద్‌బాలి అనే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. అతని లుక్, క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ అన్నీ ఈ సినిమాలో భిన్నంగా ఉండ‌బోతున్నాయి అని తెలుస్తోంది. ఐదు పాట‌లు ఉన్న ఈ చిత్రానికి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత ద‌ర్శ‌కుడు. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌, శ్రీ‌కాంత్ విస్సా రైట‌ర్‌, మార్తాండ్ కె వెంక‌టేష్ ఎడిట‌ర్‌, గాంధీ న‌డికుడిక‌ర్ ఆర్ట్ డైరెక్ట‌ర్. ప్ర‌స్తుతం ‘భ‌ళా తంద‌నాన’ చిత్రీకర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్