Wednesday, March 11, 2026
Homeసినిమాఆసక్తి రేపుతున్న రాజరాజచోర టీజర్

ఆసక్తి రేపుతున్న రాజరాజచోర టీజర్

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, గాలి సంపత్.. ఇలా విభిన్న కథా చిత్రాల్లో నటిస్తున్న యువ హీరో శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం రాజరాజచోర. ఇందులో మేఘా ఆకాశ్ కథానాయిక. ఈ చిత్రానికి హసిత్ గోలి దర్శకత్వం వహించారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సందర్భంగా రాజరాజచోర టీజర్‌ను చిత్రయూనిట్ సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీవిష్ణు.. సాఫ్ట్ వేర్‌ ఉద్యోగినని చెప్పుకునే దొంగగా కనిపించనున్నారు. ఈ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ గా రవిబాబు కనిపించనున్నారు. ఈయన నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. అలాగే.. గంగవ్వ, సునైనా ఇందులో కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ టీజర్‌ని షేర్‌ చేసిన శ్రీవిష్ణు..  ఈ పాత్రతో మీ ముందుకి రావడం నా అదృష్టం. ఈ కిరీటం ధరించినందుకు మీ పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తానన్నది నా శపథం అని ట్వీట్‌ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. శ్రీ విష్ణు తన శపథం నిలబెట్టుకునేలానే ఉన్నాడు అనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular