Thursday, March 19, 2026
Homeసినిమాపవన్ 'ఓజీ' లో ఛాన్స్ కొట్టేసిన శ్రియా రెడ్డి!

పవన్ ‘ఓజీ’ లో ఛాన్స్ కొట్టేసిన శ్రియా రెడ్డి!

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ డ్రామా ‘ఓజీ’. అనేది ఉపశీర్షిక. ఇందులో పవన్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా యువ కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే… ఈ సినిమాలో మరో అమ్మాయి కూడా ఉన్నట్టు ప్రకటించారు మేకర్స్. ఓజీలో వెర్సటైల్ నటి శ్రియా రెడ్డి కూడా నటిస్తున్నట్టుగా మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇవ్వగా ఈ వెల్కమ్ తో పోస్టర్ ను రిలీజ్ చేశారు. శ్రియా రెడ్డి ఎవరో కాదు .. హీరో విశాల్ బ్రదర్ విక్రమ్ కృష్ణ భార్య. గతంలో కొన్ని తమిళ సినిమాల్లో .. ఒకటి రెండు తమిళ సినిమాల్లో ఆమె నటించింది.

‘సలార్’ సినిమాలోను ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్న శ్రియా రెడ్డి, ‘OG’లోను ఛాన్స్ కొట్టేసిందన్న మాట. ఈ కథ 1950 కాలంలో .. ముంబై నేపథ్యంలో కొనసాగుతుందని అంటున్నారు. ఆ కాలానికి చెందిన గ్యాంగ్ స్టర్ గా పవన్ కనిపిస్తారని చెబుతున్నారు. ఈ డిసెంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.  సినిమాతోనైనా తెలుగులో ప్రియాంక అరుళ్ మోహన్ కి హిట్ పడుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular