Saturday, January 18, 2025
Homeసినిమాశ్రుతి హాసన్ ను చూసి షాక్ కావలసిందే!

శ్రుతి హాసన్ ను చూసి షాక్ కావలసిందే!

శ్రుతి హాసన్ ను కెరియర్ ఆరంభంలో చూసినవాళ్లు .. వెండితెరపై బంగారు తీగగా ఆమెను గురించి చెప్పుకున్నారు. ఇంతటి నాజూకుదనం ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అందానికి తగిన అభినయం ఉన్నప్పటికీ, అదృష్టం కలిసి రావడానికి ఆమెకి కొంత సమయం పట్టింది. ఆ తరువాత ఆమె తెలుగు .. తమిళ .. హిందీ సినిమాలు చేస్తూ వెళ్లింది. అయితే తెలుగు సినిమానే ఆమెకి ఎక్కువగా కలిసొచ్చింది.

టాలీవుడ్ లోని స్టార్ హీరోయిన్స్ లో ఒకరుగా శ్రుతిహాసన్ క్రేజ్ తెచ్చుకుంది. పవన్ కల్యాణ్ .. రవితేజ … ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ … బన్నీ జోడీకట్టిన ఈ బ్యూటీ, త్వరలో ప్రభాస్ సరసన ‘సలార్’లో సందడి చేయనుంది. అయితే తెలుగులో ఒక రేంజ్ లో ఆమె కెరియర్ కొనసాగుతూ ఉండగానే, ఆమె బాలీవుడ్ పై ఎక్కువగా దృష్టిపెట్టింది. దాంతో ఆమె బాలీవుడ్ లోనే బిజీ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆమె మళ్లీ టాలీవుడ్ దిశగానే రావలసి వచ్చింది.

ఇక్కడ ‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో, ఇక నుంచి కథల ఎంపిక విషయంలో .. పాత్రలను ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ శ్రుతిహాసన్ అలాంటివేమీ పట్టించుకోలేదు. ఏ పాత్ర ఇచ్చినా ఓకే అన్నట్టుగా ఆమె ముందుకు వెళ్లడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పాత్ర నిడివినిగానీ .. ప్రాధాన్యతనుగాని ఎంతమాత్రం పట్టించుకోవడం లేదు. మొన్నామధ్య వచ్చిన ‘వకీల్ సాబ్’ మాత్రమే కాదు, నిన్న వచ్చిన ‘హాయ్ నాన్న’ సినిమాలోను అదే పరిస్థితి. ఆమె గ్లామర్ లో చాలా తేడా వచ్చింది. ఈ అమ్మాయెవరో  శ్రుతి హాసన్ మాదిరిగానే ఉందే అనుకుంటామన్న మాట.

RELATED ARTICLES

Most Popular

న్యూస్