Saturday, January 18, 2025
HomeసినిమాPrabhas, Rajamouli: ప్రభాస్ 'కల్కి' మూవీలో రాజమౌళి..?

Prabhas, Rajamouli: ప్రభాస్ ‘కల్కి’ మూవీలో రాజమౌళి..?

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి’. ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. దీపికా పడుకునే, దిశా పటానీ నటిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు. దీనికి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు కానీ.. సమ్మర్ లో విడుదల కానుందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో రాజమౌళి నటించనున్నారని ఓ వార్త బయటకు వచ్చింది. ఇందులోని ఆ పాత్ర నచ్చడంతో రాజమౌళి నటించేందుకు ఒప్పుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఇటీవల జక్కన్న ఓ యాడ్ లో నటించారు. అలాగే తను తెరకెక్కించే సినిమాల్లో అప్పడప్పుడు అలా కనిపించి ఇలా వెళ్లిపోతుంటారు. అయితే.. కల్కి సినిమాలో మాత్రం ముఖ్యపాత్రలో నటించమని కాంటాక్ట్ చేశారని తెలిసింది. దీనికి దర్శకధీరుడు ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. నిజమైతే ఈ సినిమాకు మరింత క్రేజ్ పెరగడం ఖాయమని చెప్పచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్