Sunday, January 19, 2025
Homeసినిమాకల్కిని ప్రశ్నించిన జక్కన్న.

కల్కిని ప్రశ్నించిన జక్కన్న.

ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ వర్కింగ్ టైటిల్ ‘ప్రాజెక్ట్ కే’. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఇందులో అమితాబ్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం. దీంతో ఈ సినిమా పై మరింత క్రేజ్ పెరిగింది. అయితే.. ప్రాజెక్ట్ కే టైటిల్ ‘కల్కి 2898 ఏడీ’ అని ప్రకటించి.. గ్లింప్స్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు మరింతగా పెరిగాయి. ఇది హాలీవుడ్ రేంజ్ లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పటి వరకు రాని విభిన్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారనేది అర్థం అయ్యింది.

కల్కి గ్లింప్స్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా కల్కి గ్లింప్స్ చాలా బాగుంది అంటూ కామన్ ఆడియన్స్ మాత్రమే కాదు.. సెలబ్రీటీలు కూడా అభినందిస్తున్నారు. అయితే.. దర్శకధీరుడు రాజమౌళి కూడా కల్కి గ్లింప్స్ గురించి స్పందించారు. ఇంతకీ జక్కన్న ఏమన్నారంటే.. డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రొడక్షన్ బ్యానర్ వైజయంతి మూవీస్ కి గ్రేట్ జాబ్ అంటూ కితాబిచ్చారు. ఇలాంటి మూవీ తీయాలంటే చాలా కష్టతరం అని, దాన్ని పాజిబుల్ చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రభాస్ లుక్ స్మాషింగ్ అంటూ చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా చివరగా, కల్కి2898AD రిలీజ్ డేట్ ఎప్పుడు అని అని ప్రశ్నించారు. రాజమౌళి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. రాజమౌళి ట్వీట్ పై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు కామెంట్ చేస్తున్నారు. జక్కన్న కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అడుగుతున్నారంటూ కామెంట్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. ఆరత్వాత సంక్రాంతికి రావడం లేదు సమ్మర్ కి వస్తుందని ప్రచారం జరుగుతంది. మేకర్స్ మాత్రం 2024లో రిలీజ్ అన్నారు కానీ.. రిలీజ్ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. మరి.. త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్