Monday, March 16, 2026
HomeసినిమాThaman: 'గుంటూరు కారం' నుంచి థమన్ ఔట్?

Thaman: ‘గుంటూరు కారం’ నుంచి థమన్ ఔట్?

ఇండస్ట్రీలో బాగా వార్తల్లో ఉన్న సినిమా గుంటూరు కారం. మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ క్రేజీ కాంబినేషన్లో మూవీ గురించి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత 12 సంవత్సరాలకు ఈ కాంబో సెట్ అయ్యింది. ఎంతో ఉత్సాహంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే.. ఏ ముహూర్తాన ఈ సినిమాని ప్రారంభించారో కానీ.. షూటింగ్ కి బ్రేకులు పడుతూనే ఉంది. ఈ సినిమా గురించి వారానికో వార్త ప్రచారంలోకి వస్తుండడంతో గుంటూరు కారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే.. మహేష్‌ బాబు ‘సర్కారు వారి పాట’కు థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఒకటి రెండు పాటలు తప్ప మిగిలిన పాటలు అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో మహేష్ బాగా ఫీలైయ్యాడట. అందుకనే గుంటూరు కారం చిత్రానికి థమన్ కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిద్దామన్నారట.. అయితే.. త్రివిక్రమ్ పట్టుబట్టడంతో మహేష్ కాదనలేకపోయాడు. ఈ మూవీకి సరిగా ట్యూన్స్ అందివ్వడం లేదని.. టీజర్ కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా నచ్చలేదని థమన్ ని తప్పించాలిని అనుకుంటున్నారని వార్తలు వచ్చాయి.

ఇలా వార్తలు వచ్చినప్పుడు అలాంటిది ఏమీ లేదని.. ఇదంతా పుకారు అంటూ సోషల్ మీడియా వేదికగా థమన్ కౌంటర్లు ఇచ్చాడు. అంతా సెట్ అయ్యింది థమనే ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడనుకుంటే.. థమన్ తప్పించారని తాజాగా వార్తలు వస్తున్నాయి. థమన్ ప్లేస్ లో అనిరుథ్ కానీ.. ఖుషి మ్యూజిక్ డైరెక్టర్ హేషామ్ అబ్థుల్ వాహబ్ ని కానీ తీసుకోవాలనుకుంటున్నారట. అయితే.. ఈ సినిమా నుంచి నటీనటులు, సాంకేతిక నిపుణులు తప్పుకుంటుండడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ టెన్షన్ ఫీలవుతున్నారు. మరి.. ఈ సమస్యలన్నీ ఎప్పటికి కొలిక్కి వస్తాయో.. గుంటూరు కారం ఎప్పుడు పూర్తవుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular