We come: ఆంధ్రప్రదేశ్ లో కూడా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. రాజమండ్రిలో బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖ ఏర్పాటుచేసిన గోదావరి గర్జన బహిరంగసభలో నడ్డా ప్రసంగించారు. ఈ సభకు హాజరైన ప్రజల స్పందన చూస్తుంటే ఇక్కడి ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని, బిజెపి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు అర్ధమవుతుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయని దుయ్యబట్టారు. సిఎం జగన్ కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తున్నారని, పంచాయతీలకు అందించాల్సిన నిధులను కూడా దారి మళ్ళించారని నడ్డా విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని, అప్పు 8 లక్షల కోట్ల రూపాయలకు చేసుకుందన్నారు. ప్రతిపక్షాలను ఈ ప్రభుతం అణచి వేస్తోందని ఆరోపించారు. ఈ పాలనలో కొత్తగా ఎలాంటి పెట్టుబడులు రావడం లేదని, ఉన్న పరిశ్రమలు కూడా తరలి వెళుతున్నాయని నడ్డా అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో కేవలం కొన్ని వర్గాలను మాత్రమే ఆకట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నటి, మాజీ ఎంపీ జయప్రద ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ప్రసంగించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు.
Also Read : జగన్ అమలు చేసేవి మా పథకాలే: నడ్డా