Sunday, January 19, 2025
HomeTrending Newsసిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం

సిఆర్డీయే రద్దు చెల్లదు: హైకోర్టు ఆదేశం

Amaravathi only:  సిఆర్డీయే చట్టం ప్రకారం రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.  రైతులకు  మూడు నెలల్లో ప్లాట్లు మౌలిక వసతులతో సహా అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించింది.  సిఆర్డీయే చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని, మాస్టర్ ప్లాన్ ను అమలు చేయాలని తీర్పు చెప్పింది.  మాస్టర్ ప్లాన్ ప్రకారం రాజధానిని ఆరునెలల్లోగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి సూచించింది, ఎంత అభివృద్ధి చేశారనేదానిపై ఆరునెలల్లోగా  హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. రాజధానిపై పిటిషన్లను రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది.

మూడు రాజధానులు, సిఆర్డీయే రద్దును సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన వివిధ పిటిషన్లపై హైకోర్టు నేడు తీర్పు చెప్పింది.  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిక్  ఎం. సత్యనారాయణ మూర్తి, దివివిఎస్ సోమయాజులు లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన పునర్విభజన చట్టానికి అనుగుణంగా రూపొందించిన సిఆర్డీయే చట్టాన్ని మార్పు చేసే శాశన అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, రాజధాని భూములను ఇతర అవసరాలకు వినియోగించడానికి గానీ లేదా తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.  రాజధాని అభివృద్ధిపై న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని ధర్మాసనం వెల్లడించింది.

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 68 మందికి కోర్టు ఖర్చుల కింద యాభై వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్