Saturday, January 18, 2025
HomeTrending Newsఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సిఎం జగన్

ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: సిఎం జగన్

In memory of Gowtham: గౌతమ్‌ రెడ్డి ఇక లేదన్న విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక పోతున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చిన్న తనం నుంచి గౌతమ్ రెడ్డి తెలుసమని, తనకు మంచి మిత్రుడని, తన వల్లే గౌతమ్ రాజకీయాలలోకి వచ్చాడని గుర్తు చేసుకున్నారు.  నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభలో సిఎం జగన్ పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

“గౌతమ్ మన మధ్య లేడనే వార్త చాలా కష్టంగా ఉంది. తాను ఇక లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్‌ నాకు మంచి స్నేహితుడు. ప్రతీ అడుగులో నాకు తోడుగా ఉన్నాడు. గౌతమ్‌ రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం చెప్పలేనిది. రాజకీయాల్లోని తనను నేను తీసుకువచ్చాను. రాజకీయాల్లో ఇద్దరం మంచి స్నేహితులుగా ఉన్నాం. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ గౌతమ్‌ రెడ్డి కుటుంబానికి తోడుగా ఉంది. గౌతమ్‌ రెడ్డి ఏపీ మంత్రి వర్గంలో పరిశ్రమల శాఖ సహా ఆరు శాఖలను నిర‍్వహించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ఆయన చివరి క్షణం వరకు కృషి చేశారు. గౌతమ్‌ రెడ్డి ప్రతీ అంశంలోనూ నన్ను ప్రోత్సహించారు. మే 15 వరకు సంగం బ్యారేజీని పూర్తి చేసి.. గౌతమ్‌ రెడ్డి గౌరవార్ధం ఆ బ్యారేజీకి ఆయన పేరును పెడతాం”  అని జగన్ తన ప్రసంగంలో వెల్లడించారు.

వైఎస్‌ఆర్‌ కుటుంబం ముందు నుండి తమకు అండగా ఉందని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. సిఎం వైఎస్‌ జగన్‌మెహన్‌ రెడ్డికి తమ కుటుంబపై చూపిన ప్రేమకు ఆయన  ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. ఈ సభలో మంత్రులు, ఎంపీలు, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు.

Also Read : సంగం బ్యారేజీకి గౌతమ్ రెడ్డి పేరు : సిఎం

RELATED ARTICLES

Most Popular

న్యూస్