Sunday, January 19, 2025
Homeసినిమానవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’

నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’

మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో ప్రేక్షకుల తీసుకు వస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి. సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటిలో కాకుండా థియేటర్స్ లో ఈ సినిమాను తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాం. ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలి అన్నారు.

చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ… కథ విషయానికి వస్తే..  ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే ‘రివెంజ్ డ్రామా’ కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్