Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచూడు చూడు అమెరికా-2

చూడు చూడు అమెరికా-2

ఇండియా లాంటి దేశాల నుంచి అమెరికాకు వెళ్ళేది చదువు కోసం, ఉద్యోగం కోసం. మాస్టర్స్ చదువుకోడానికి వచ్చి ఇక్కడే ఉద్యగంలో చేరేవాళ్ళు ఎక్కువ. మాస్టర్స్ చేసే సమయంలో పార్ట్ టైం జాబ్ చేయనివాళ్లు ఉండరు. అమెరికాలో నివాసం ఉన్న వాళ్లు కూడా పిల్లల్ని పంపుతారు. ఫీజులకు లక్షల రూపాయల ఖర్చు భరించలేరు కాబట్టి చాలా వరకు స్టూడెంట్స్ చదువుతూ సంపాదిస్తారు. ఇదే ఇక్కడ గొప్ప అనుభవం. గ్యాస్ స్టేషన్ (పెట్రోల్ బంక్), రెస్టారెంట్స్, హోటల్స్ లో ఎక్కువ మంది పని చేస్తారు. గంటకు పది నుంచి ఇరవై డాలర్లు సంపాదిస్తారు. కొన్ని చోట్ల యూనివర్శిటీ క్యాంపస్ లో కూడా ఇలా పని చేసే ఛాన్స్ ఉంది. అమెరికాలో ఎవరు ఏ పని ఐనా (డిగ్నిటీ ఆఫ్ లేబర్ )మొహమాటం లేకుండా చేస్తారు. అందుకే రిచ్ ఐనా పూర్ ఐనా అన్నీ నేర్చుకుంటారు.

గ్యాస్ స్టేషన్

మన దగ్గర పెట్రోల్ బంక్ లను అక్కడ గ్యాస్ స్టేషన్ అంటారు. పెట్రోల్ డీజిల్ తో పాటు వెహికిల్ పార్కింగ్, రెస్ట్ రూంలు ఉంటాయి. ప్రతి గ్యాస్ స్టేషన్ లో టీ, కాఫీతో పాటు స్నాక్స్ దొరుకుతాయి. మనం పెట్రోల్ డీజిల్ లీటర్ల లో పోపిస్తం. అమెరికాలో గ్యాలన్ అంటారు. ఒక గ్యాలన్ నాలుగు లీటర్ల ఉంటుంది. మన లాగా పెట్రోల్ బంక్ ల్లో మనుషులు ఉండరు. ఎవరి కారుకి వాళ్ళే పెట్రోల్ కొట్టుకోవాలి. కార్డ్ ద్వారా అమౌంట్ పే చేయాలి.

బస్ జర్నీ

అమెరికాలో ప్రయాణం చేయడానికి బస్ జర్నీ అన్నింటి కంటే చీప్. రైల్ ఛార్జీలు ఫ్లైట్ టికెట్ కంటే తక్కువేమీ ఉండవు. ప్రైవేట్ ట్రైన్స్ ఉంటాయి. బస్ లో ఏసీ ఉంటుంది. వైఫై సౌకర్యం ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులే ఎక్కువ. మన దగ్గర ఇంటికో కారు ఉన్నట్టు అమెరికాలో మనిషికో కారు తప్పనిసరి. కారు లేకుంటే అడుగు బయట పెట్టలేం. స్టూడెంట్ కు కూడా కారు ఉండాల్సిందే. కారు లేని వాళ్ళు… డ్రైవింగ్ రాని వాళ్ళు అసలు ఉండరు. మనతో పోల్చితే కారు ధరలు తక్కువ. కొనేటప్పుడు టాక్స్ ఉండదు. కారు ఉంటే మాత్రం రోడ్ టాక్స్ కట్టాలి. ఇక్కడ తాగి నడిపి దొరికితే మాత్రం జైలుకే.  ఒకచోట రాష్ట్రం నుంచి మరో చోటుకు వెళ్లాలంటే కనీసం మూడు నుంచి ఎనిమిది గంటల జర్నీ ఉంటుంది. లెక్కలేనన్ని ప్రైవేట్ ఎయిర్ లైన్స్ ఉంటాయి. ఏ ఎయిర్ లైన్ లో వెలుతున్నమో ముందే తెలుసుకోవాలి. ఒక్కో ఎయిర్ లైన్ కు ప్రత్యేకమైన ఎంట్రీ ఉంటుంది.

ట్యాక్స్ ఫ్రీ రాష్ట్రాలు

అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీ ఉంటుంది. డెలావేర్, న్యూ హంప్ షైర్ లాంటి రాష్ట్రాల్లో టాక్స్ ఉండదు. బయటి రాష్ట్రాలలో కంటే తక్కువ ధరలకు వస్తువులు దొరుకుతాయి. ఎలక్ట్రానిక్స్, లిక్కర్ బాగే తక్కువ ధరకు వస్తాయి.

క్రూయీజ్ జర్నీ

బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా క్రూయిజ్ లో ప్రయాణం థ్రిల్లింగ్. ఫ్లోరిడా రాష్ట్రం మైమి నుంచి బహమాస్ అనే ఐలాండ్ దేశానికి మూడు రోజుల ప్రయాణం.  క్రూయిజ్ లో ఎక్కినప్పటి నుంచి తిరిగి మూడు రోజుల తరవాత వచ్చేదాకా సిగ్నల్ లేకుండా … ఫోన్ కాంటాక్ట్ లేకుండా ద్వీపంలో జీవితం. ఒకేసారి మూడువేల మంది కి పైగా ప్రయాణించే కెపాసిటీ. పన్నెండు ఫ్లోర్ లు. ఫైవ్ స్టార్ హోటల్ ను మించిన ఫెసిలిటీ. ఒక పెద్ద స్టార్ హోటల్ ను బోట్ మీద పెట్టి తీసుకెళ్తున్నట్టు . స్టేట్ రూంలో టీవీ, బెడ్, సోఫా, రెస్ట్ రూం.. బాల్కనీ..రాత్రంతా ప్రయాణం… పగలు ఐలాండ్ లో బీచుల్లో సరదాగా గడపడం. వాటర్ స్స్పోర్ట్స్, స్విమ్మింగ్ ల్లో బిజీ. క్రూయిజ్ లో కాంటినెంటల్ ఫుడ్. సీ ఫుడ్ ప్రత్యేకం. సాయంత్రం క్రూయిజ్  డౌన్ టౌన్ లా మారిపోతుంది. ఒకవైపు షాపింగ్…క్యాసినో మరోవైపు డాన్స్ ఇన్ స్ట్రీట్ తో న్యూయార్క్, పారీస్ నైట్ లైఫ్ ను తలపిస్తుంది. అమెరికా లోని చాలా పోర్ట్ ల నుంచి cruise బయలు దేరుతుంది. బహమాస్, అలాస్కా, హవాయి లాంటి ప్లేస్ లకు వెళతాయి. కొన్ని మూడు రోజులు, కొన్ని వారం రోజులు, పది రోజులు కూడా ట్రిప్ ఉంటుంది. క్రూయిజ్ లో కూడా మొబైల్ పనిచేయడానికి ఇంటర్నెట్ ప్యాకేజీలు ఉన్నా ఎవరు తీసుకోరు.

ఎయిర్ బీ ఎన్ బీ విడుదులు

హైదరాబాద్ లో సర్వీస్ అపార్ట్మెంట్ ల లాగా అమెరికాలో AIR BNB లు ఉంటాయి. నాలుగు ఐదు బెడ్ రూంలు, కిచెన్, వాషింగ్ మెషీన్, స్విమింగ్ ఫూల్ తో పెర్ఫెక్ట్ ఇండిపెండెంట్ హౌజ్. గేట్ డ్ కమ్యూనిటీ లాగా ఉంటుంది. ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఒకరోజు నుంచి ఎన్ని రోజులైనా రెంట్ కు తీసుకోవచ్చు. మన వంట చేసుకుని తింటూ ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఫ్యామిలీ లేక ఎక్కువ మంది కలిసి వచ్చినపుడు హోటల్ కంటే ఇది బాగుంటుంది. ఏరియా ను బట్టి కనీసం రోజుకు 400-500 డాలర్లు ఉంటుంది. అంతా రిమోట్ ఆపరేషన్ ఉంటుంది. ఫిజికల్ గా మనుషులు ఎవరు అక్కడ ఉండరు. డోర్ ఓపెన్, లాక్ కూడా పాస్వర్డ్ తో చేయాలి.

-సోమగోపాల్ కడిమెట్ల
99483 75129

RELATED ARTICLES

Most Popular

న్యూస్