Friday, October 18, 2024
Homeసినిమాజూలై 28న ‘విక్రాంత్ రోణ’

జూలై 28న ‘విక్రాంత్ రోణ’

Vikranth coming: శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ‌`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్ పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు.

ఈ చిత్రంలో ‘గ‌దాంగ్ రాక్క‌మ్మా’ పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాక్వ‌లైన్‌ న‌ర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బ‌మ్‌ నుంచి తొలి సాంగ్‌గా విడుద‌ల చేశారు. త్రీడీ మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన విక్రాంత్ రోణ టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమా పై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే క్ర‌మంలో సినిమా నుంచి ‘రా రా రాక్కమ్మా’ అనే ఫుట్ ట్యాపింగ్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ‌దాంగ్ రాక్క‌మ్మ పాత్ర‌ధారిగా బాలీవుడ్ స్టార్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మెస్మ‌రైజ్ చేస్తుంది. మంగ్లీ, న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. సాంగ్ చూస్తే ఓ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్‌, జాక్వ‌లైన్ ఈ పాట‌లో చేసిన డ్యాన్స్‌, పాట బీట్ వింటే రేపు సిల్వ‌ర్ స్క్రీన్ పై సినిమా సంద‌డి చేయ‌టం ప‌క్కా అని తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా జాక్వ‌లైన్ మాట్లాడుతూ… ‘రాక్కమ్మా ఓ డిఫ‌రెంట్ సాంగ్. పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి ట్యూన్‌కు చ‌క్క‌టి లిరిక్స్ కుదిరాయి. దాన్ని అద్భుతమైన డ్యాన్స్ సాంగ్‌గా చిత్రీక‌రించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో మాస్ ఆడియెన్స్‌కు న‌చ్చే సాంగ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సాంగ్‌లో హుక్ స్టెప్‌ను ఎవ‌రైనా ఒక‌సారైనా వేయాల‌ని భావిస్తారు అన్నారు.

Also Read : ఓటీటీ ఫ్యాన్సీ ఆఫ‌ర్‌ రిజెక్ట్ చేసిన ‘విక్రాంత్ రోణ‌’ టీం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్