Sunday, September 8, 2024
Homeసినిమారామోజీ ఫిల్మ్ సిటీలో సుధీర్‌బాబు, హ‌ర్ష‌ వ‌ర్ధ‌న్ మూవీ షూటింగ్

రామోజీ ఫిల్మ్ సిటీలో సుధీర్‌బాబు, హ‌ర్ష‌ వ‌ర్ధ‌న్ మూవీ షూటింగ్

Sudheer in RFC: హీరో సుధీర్ బాబు నటుడు, దర్శకుడు హర్షవర్దన్ కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోంది. ఈ సినిమాను సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకం పై ప్రొడ‌క్షన్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాను ఘనంగా ప్రారంభించారు. నేడు ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను హైద్రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభించారు. ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

షూటింగ్ ప్రారంభం అంటూ చిత్రయూనిట్ ఓ వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ బాబు లుక్ పూర్తిగా రివీల్ కాలేదు కానీ.. సుధీర్ బాబు మాత్రం ఇది వరకు ఎన్నడూ కనిపించని లుక్‌లో అందరినీ ఆశ్చర్యపరచబోతోన్నట్టు తెలుస్తోంది. సుధీర్ బాబు కెరీర్‌లో 15వ సినిమాగా రాబోతోన్న ఈ మూవీలో ఛాలెంజింగ్ పాత్రను పోషించనున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్నమైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శకుడు హ‌ర్ష వ‌ర్ధన్‌.

యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్ర‌ఫీ భాధ్య‌తలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వర‌లో తెలియజేస్తారు.

Also Read : సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం

RELATED ARTICLES

Most Popular

న్యూస్