Tuesday, September 17, 2024
Homeసినిమాసుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం

సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం

Sudheer Babu new film:
ప్రస్తుతం ప‌లు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ల‌తో మ‌న ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్‌లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. సోనాలి నారంగ్‌, సృష్టి స‌మ‌ర్ఫ‌ణ‌లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ప‌తాకం పై ప్రొడ‌క్ష‌న్ నెం.5 గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్నమైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శకుడు హ‌ర్ష వ‌ర్ధన్‌.

ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్యక్రమాల‌తో ప్రారంభ‌మైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శకుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో ప్రముఖ న‌టీన‌టులు కీల‌క పాత్రల‌లో న‌టించ‌నున్నారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా పీజీ విందా సినిమాటోగ్రఫి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజీవ్ ఆర్ట్ డైరెక్టర్. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వర‌లో తెలుప‌నున్నారు.

Also Read : తిరుప‌తిలో.. ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ

RELATED ARTICLES

Most Popular

న్యూస్