Friday, March 20, 2026
Homeసినిమా'వీరసింహారెడ్డి' సుగుణ సుందరి లిరికల్ వీడియో విడుదల

‘వీరసింహారెడ్డి’ సుగుణ సుందరి లిరికల్ వీడియో విడుదల

నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి. గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నారు. టాప్ ఫామ్‌లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య స్మాషింగ్ హిట్‌ గా నిలిచింది. ఈ రోజు సెకండ్ సింగిల్ సుగుణ సుందరి లిరికల్ వీడియోను విడుదల చేశారు. థమన్ ట్యూన్ లవ్లీగా కన్సిస్టెంట్ పేస్ తో ఆకట్టుకుంది. రామ్ మిరియాల, స్నిగ్ధ హై-పిచ్ వోకల్స్ తో ఈ పెప్పీ నెంబర్ ని ఎనర్జిటిక్ గా ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ మాస్‌ ని మెస్మరైజ్ చేయగా కొన్ని లైన్లు మరింత కిక్ ఇచ్చేలా వున్నాయి.

బాలకృష్ణ ట్రెండీ అవుట్ ఫిట్స్ లో క్లాస్‌ గా కనిపించినప్పటికీ, డ్యాన్స్‌లు మాస్‌ ని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. మరో వైపు శృతి హాసన్ తన ఎలిగెన్స్ తో కట్టిపడేసింది. డ్యాన్స్ మూమెంట్స్ కనుల విందుగా వున్నాయి.  ఇస్తాంబుల్‌ లోని అందమైన ప్రదేశాలు ఆహ్లాదకరంగా చూపించారు.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular