Sunday, January 19, 2025
Homeసినిమామ్యారేజ్ బ్యాండ్ మోత మోగించేలానే ఉంది!

మ్యారేజ్ బ్యాండ్ మోత మోగించేలానే ఉంది!

ఈ మధ్య కాలంలో మలయాళంలో మాదిరిగా ఇక్కడ కూడా చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతూ వెళుతోంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటే చాలు, ఆడియన్స్ ఎంతమాత్రం ఆలోచించకుండా హిట్ పట్టుకొచ్చి చేతుల్లో పెడుతున్నారు. కొన్ని చిన్న సినిమాలు విడుదలైన తరువాత మౌత్ టాక్ తో విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు విడుదలకి ముందే హైప్ ను క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ఒకటిగా కనిపిస్తోంది.

సుహాస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో శరణ్య ప్రదీప్ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మించగా, దుష్యంత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోస్టర్ వచ్చినప్పుడు ఆడియన్స్ అంతగా పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత వచ్చిన అప్ డేట్స్ తో అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఒక పల్లెటూరు .. ఒక వైపున సెలూన్ షాపు నడుపుతూనే బ్యాండుమేళంలో పనిచేసే ఒక యువకుడి ప్రేమకథగా ఇది జనానికి కనెక్ట్ అయింది.

ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ట్రైలర్ చూసినవాళ్లు ఇది కులాల మధ్య పోరాటం అనుకునే అవకాశం ఉందని భావించిన మేకర్స్ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. కులాలను హైలైట్ చేయడం జరగలేదనీ, లవ్ అనేది కూడా ఒక అంశంగా మాత్రమే కనిపిస్తుందని చెప్పారు. ఒక గ్రామీణ వాతావరణంలోని అన్ని అంశాలను కవర్ చేస్తూ నడిచే కథగానే దీనిని చూడాలని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్