Saturday, March 14, 2026
Homeసినిమా‘బలమెవ్వడు’లో సుహాసిని పవర్ ఫుల్ రోల్

‘బలమెవ్వడు’లో సుహాసిని పవర్ ఫుల్ రోల్

దశాబ్దాలుగా  తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహాసిని. తెలుగు ప్రేక్షకులకు ఆమెపై ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గతంలో ‘రాఖీ’ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో మనకు తెలుసు. ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను “బలమెవ్వడు” చిత్రంలో పోషిస్తున్నారు. “బలమెవ్వడు” సినిమాలో మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడే నిజాయితీ గల డాక్టర్ యశోద పాత్రలో నటిస్తున్నారు.

ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన “బలమెవ్వడు” కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ  డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి : సంగీతం – మణిశర్మ, సాహిత్యం – కళ్యాణ్ చక్రవర్తి, సినిమాటోగ్రఫీ – సంతోష్ శక్తి, గిరి.పి, ఎడిటర్- జెస్విన్ ప్రభు, ఫైట్స్ – శివరాజ్, కాస్ట్యూమ్స్ – హరీష రాచకొండ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధృవన్ కటకం, నిర్మాత – ఆర్ బి మార్కండేయులు, రచన దర్శకత్వం – సత్య రాచకొండ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular