Saturday, March 14, 2026
Homeసినిమాచరణ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నసుకుమార్

చరణ్ తో మూవీ ప్లాన్ చేస్తున్నసుకుమార్

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో ‘రంగస్థలం‘ సినిమా వచ్చింది. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా వీరి కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయిందని టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం చరణ్, శంకర్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయనున్నాడు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. వేణు శ్రీరామ్ తో, కన్నడ డైరెక్టర్ నర్తన్ తో చరణ్‌ మూవీ కన్ ఫర్మ్ అని ప్రచారం జరిగింది కానీ.. అధికారికంగా ఎలాంటి అప్ డేట్ లేదు.

లేటెస్ట్ సమాచారం ఏంటంటే.. ‘పుష్ప 2’ తర్వాత సుకుమార్  చరణ్ తోనే మూవీ చేస్తారట. ఈ మేరకు ఒప్పందం కుదిరిందని సమాచారం. ఇటీవల చరణ్, సుకుమార్ కలుసుకొని 2024లో సినిమా స్టార్ట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట. పుష్ప 2 తర్వాత విజయ్ దేవరకొండతో సినిమా చేయాలి అనుకున్నారు సుకుమార్. అయితే.. సుకుమార్ రేంజ్ ఇప్పుడు మారిపోయింది. అందుకే, విజయ్ దేవరకొండతో కాకుండా చరణ్ తోనే సినిమా చేయాలి అనుకుంటన్నారట. ‘లైగర్’ ఫ్లాప్ కావడంతో ఈక్వేషన్లు మారిపోయాయి. అందుకనే, విజయ్ కి సుకుమార్ హ్యాండిచ్చారని టాక్.

సుకుమార్ తప్పుకోవడంతో విజయ్ దేవరకొండ ఇప్పుడు కొత్త సినిమాలు ఒప్పుకునే పనిలో పడ్డాడు. త్వరలోనే రెండు కొత్త సినిమాల ప్రకటన వస్తుంది విజయ్ దేవరకొండ నుంచి. ఇక రామ్ చరణ్‌, సుకుమార్ సినిమాకి సంబంధించిన ప్రకటన పుష్ప 2 చివరి దశలో ఉండగా వస్తుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న లెక్క. దర్శకుడిగా తన రేంజ్ పాన్ ఇండియా లో ఉందని భావిస్తున్న సుకుమార్ దానికి తగ్గ సినిమాలు, హీరోలను ఎంచుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇదే కనుక జరిగితే.. చరణ్ ను సుకుమార్ ఈసారి ఎలా చూపిస్తారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular