Action Plan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. బాలీవుడ్ లో అయితే.. 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పుష్ప 2 పై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈపాటికే సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది కానీ.. కథపై ఇంకా కసరత్తు చేస్తుండడంతో ఆలస్యం అయ్యింది.
సుకుమార్ పుష్ప 2 కోసం భారీ ప్లాన్ రెడీ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. సుకుమార్ ఈ సీక్వెల్ ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. తాను ముందుగా రాసుకున్న స్క్రిప్టులో మార్పులు చేసి.. మరెన్ని హంగులు, భారీతనంతో సీక్వెల్ ను రూపొందించాలని నిర్ణయించాడట. దీనివల్లే ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సీక్వెల్ కి ఏకంగా 400 కోట్లు బడ్జెట్ అనుకుంటున్నారట. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా పై విపరీతమైన క్రేజ్ నెలకొంది కాబట్టి ఆయా ఇండస్ట్రీల నుంచి నటీనటుల్ని రంగంలోకి దింపుతున్నట్టు తెలిసింది. అలాగే విదేశాల నుంచి టెక్నీషియన్స్ ని కూడా తీసుకువస్తున్నారట. మొత్తానికి సుకుమార్ భారీగానే ప్లాన్ చేస్తున్నాడు. బాహుబలి 2, కేజీఎఫ్ 2.. బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. పుష్ప 2 ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో.. ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.
Also Read : ‘పుష్ప-2’లో కీలక పాత్రలో సమంత?