From September: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప రూపొందడం, బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం తెలిసిందే. పుష్ప బాలీవుడ్ ని షేక్ చేసింది. దీంతో పుష్ప 2 కోసం అభిమానులే కాకుండా ఇండస్ట్రీ జనాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈపాటికే పుష్ప 2 సెట్స్ పైకి రావాలి కానీ.. సుకుమార్ కథ పై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందకపోవడంతో ఆలస్యం అవుతుంది.
బన్నీ కూడా కథ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేద్దామని, తొందరేమీ లేదని సుకుమార్ కి చెప్పడంతో కథ పై కసరత్తు జరుగుతుంది. అయితే.. బన్నీ అభిమానులు పుష్ప ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిర్మాత బన్నీ వాసు గోపీచంద్ పక్కా కమర్షిమల్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా పుష్ప 2 గురించి అడిగితే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పుష్ప 2 సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది అన్నారు. ఇక బన్నీ నెక్ట్స్ మూవీస్ గురించి స్పందిస్తూ.. ప్రస్తుతం కథాచర్చలు జరుగుతున్నాయి. పుష్ప 2 స్టార్ట్ అయిన తర్వాత బన్నీ తదుపరి చిత్రం ఎవరితో ఉంటుంది అనేది క్లారిటీ వస్తుందన్నారు. బోయపాటి, మురుగుదాస్ లైన్లో ఉన్నారు. మరి.. బన్నీ ఎవరితో సినిమా చేయడానికి ఓకే చెబుతారో చూడాలి.
Also Read : పుష్ప 2 ప్లాన్ మారిందా?