Tuesday, March 17, 2026
Homeసినిమా`ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లు

`ఆడవాళ్లు మీకు జోహార్లు` ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్ట్ లు

AMJ Pre-release: యంగ్ హీరో శర్వానంద్ నటించిన‌ ఔట్ అండ్ ఔట్‌ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌. తిరుమల కిశోర్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 27(ఆదివారం) సాయంత్రం హైద‌రాబాద్‌లోని శిల్ప క‌ళా వేధిక‌లో వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్‌, హీరోయిన్స్ కీర్తి సురేష్‌, సాయిప‌ల్ల‌వి హాజ‌రుకానున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సార‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ కీల‌క పాత్ర‌లు పోషించ‌డం విశేషం. ఈ సినిమా పై శ‌ర్వ‌నంద్ చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular