Sunday, January 19, 2025
Homeసినిమాదాసరి స్మారక పురస్కారాల ప్రదానం

దాసరి స్మారక పురస్కారాల ప్రదానం

Awards: దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పంచమ వర్ధంతిని పురస్కరించుకుని… ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు నిర్మాతల మండలి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి  పుష్పమాల సమర్పించి జ్యోతి ప్రజ్వలన చేసి, అనంతరం “దాసరి స్మారక పురస్కారాలు” అందజేశారు.  భారత్ ఆర్ట్స్ అకాడమీ-వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్త నిర్వహణలో ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ సారధ్యంలో జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నటి-పొలిటీషియన్  దివ్యవాణి, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప్రఖ్యాత రచయిత యండమూరి, సీనియర్ నటీమణి రోజా రమణి-చక్రపాణి దంపతులు, విజయ్ చందర్, సీనియర్ హీరో సుమన్, ప్రముఖ దర్శకులు సాగర్, రాజా వన్నెంరెడ్డి, వి.బి.ఎంటర్టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ & పి.ఆర్.ఓ ధీరజ అప్పాజీ తదితరులు పురస్కారాలు స్వీకరించి  దాసరితో తమకు గల అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.

నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షులు-ప్రముఖ నటులు కాశీ విశ్వనాథ్, ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై దాసరి గొప్పతనాన్ని కొనియాడారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్